పరాశర సిదాంతము ప్రకారము వివాహ సమయములో పొంతనలు చూడటము జరుగుతుంది. ఈ సిధాంతము ప్రకారము "36"బిందువులు పోల్చి చూడటము జరుగుతుంది. చాలాసార్లు ఎక్కువ పాయింట్స్ కలిసినప్పటికీ విదిపోవడమో, మరణించ టము ద్వారా వివాహాలు పొంతనలు కుదరటము లేదు. అల్లాగే తక్కువ కలిసినప్పటికీ కొన్ని వివాహాలు సఫలీకృతం అవుతున్నవి. ప్రస్తుతము మారుతున్న ఆచార వ్యవహార, జీవన విధానాలు పరిగణ లోకి తీఉకొని కృష్ణమూర్తి (కే.పి) పద్దతి ప్రకారము పరిశీలించటము మంచిది.
మొట్ట మొదటిగా జాతకాలను వివిడిగా పరిశీలించి , జనన కాల సమయాన్ని గుర్తించడము అతి ముఖ్యమైన విషయము.
- లగ్న ఉపాధి పతులు ఇరువురి జాతకములో మిత్రులుగాను, సములుగాను ఉండవలెను.
- సప్తమ భావము, ద్వితీయ భావము ఉపాధి పతులుకుడా మిత్రులుగాని , సములు గాని అయి ఉండవలెను. శత్రుత్వము, అతి శత్రుత్వము మంచిది కాదు.
- లగ్నము రాశుల స్వభావాలు (అగ్ని, భూమి, వాయు, జలము) గమనించాలి. అగ్ని- అగ్ని, భూమి -భూమి, జలం - జలం , వాయు - వాయు, అగ్ని -వాయు,ఇలా కలిసినవి వుండటం మంచిది.
- జన్మ నక్షత్రాలు 2,3,5,7,9,11 ఉండటం మంచిది.
- జాతకములో లాభ స్తానము అయిన ఏకాదశ ఉపాదిపతికి ఎటువంటి పరిస్తితిలోనూ 6,8,12 లకు సంబంధము ఉండకూడదు.
ఇరువురి జాతకములో గమనించాల్సిన ముఖ్యాంశాలు
- సప్తమ భావ ఉపాధి పతికి 5,7,11 సంబంధము ఉన్న సుఖము అయిన వైవాహిక జీవితము.
- సప్తమ భావ ఉపాదిపతికి 6,8,12 సంబంధము ఉన్న వైవాహిక జీవితము విఫలము అవుతుంది.
- సప్తమ భావ ఉపాదిపతి కి 1,6,10 సంబంధము ఉన్న సుఖ, శాంతులు ఉండవు. అత్తా మామలతో విబేధాలు ఉంటాయి.
- సప్తమ భావ ఉపాధి పతికి 3,9 సంబంధము ఉన్న కొంతకాలము ఎడబాటు ఉంటుంది.
- సప్తామ భావ ఉపాదిపతికి 6,8,12 సంబంధము ఉన్న పరస్పర అంగీకారముతో విడాకులు సంభవిస్తాయి.
- సప్తమ భావ ఉపాదిపతి మేషరాశి సంబంధు ఉన్న కోపిష్టిగాను, తొందరపాటు తనము గల వ్యక్తిగాను ఉంటారు, అధిక వాంచలు కలవారిగా ఉంటారు.