సనాతన గ్రంధాలలో వాస్తు ప్రశస్థి : మయామతం అనే గ్రంధములో వాస్తు అన్న పదానికి నివసించదగ్గ ప్రదేశము అని విస్తృతార్థములో చెప్పబడినది. వాస్తు శాస్త్రాన్ని వరాహమిహిరుడు, మయుడు, భాస్కరాచార్య విదేశీయుడైన న్యూటన్‌ ఇంకా అనేకమంది వారివారి అనుభవము ద్వారా విశదీకరించారు. భూమికి అయస్కాంత శక్తి ఉన్నదని సమస్త గ్రహగతులు అన్నీ ఈ అయస్కాంత శక్తి ద్వారానే వివిధ కక్ష్యలలో ఆత్మ పరిభ్రమణం చేస్తూ ఉంటాయని శాస్త్రజ్ఞులు నిరూపించారు. ఇదే విషయాన్ని పురాణాలలో చెప్పడం జరిగింది. భారతీయ పురాణాలలో ఆచరణీయంగా చెప్పబడిన ఆచారాలుగాను, శాస్త్ర విషయాలుగాను చెప్పబడిన ప్రతీ విషయానికి నవీన, ఆధునిక విజ్ఞానం బలపరిచింది. ఉదాహరణకు భూమికి ఉత్తరాన ఎక్కువ పదార్థం ఉండుటవల్ల ఎక్కువ ఆకర్షణ ఉత్తరం వైపు ఉంటుంది. అయస్కాంత శక్తులు దక్షిణం నుండి ఉత్తరం వైపుకు లాగబడుతుంటాయి. దీని వలన మనుష్యులలో ఉన్న శక్తికి ఒడిదుడుకులు ఏర్పడుతాయి. మన పురాణాలలో ఉత్తర దిక్కుకు తలపెట్టరాదని చెప్పడం జరిగింది. దీని మూలంగా మానసిక రోగములు, అశాంతి, బలహీనతలు, నేర ప్రవృత్తి ఏర్పడుతాయి. మన శరీరంలో ఇనుప ధాతువులు ఉన్న కారణంచే ఉత్తరానికి తల యుంచి పడుకున్న వారికి మెదడులో గడ్డలు, కాన్సర్‌, మానసిక బలహీనతలు ఏర్పడుతాయి. దానికి కారణం ఉత్తర దిక్కుకు అయస్కాంత శక్తి బలంగా ఉండటమే. ఈ విషయాన్ని శివ పురాణంలో వినాయకుని శిరస్సు ఖండిరచినపుడు శివుడు ఉత్తరం వైపు శిరస్సు యుంచి నిద్రిస్తున్న వారి తలను ఖండిరచి తెమ్మనడం జరిగింది. హిందువులు శవమును ఉత్తరము వైపు తలయుంచి పడుకోపెడుదురు. ఇది ఆచారం, కానీ విజ్ఞాన అనుభవం కూడా........

ఇల్లు గాని, పరిశ్రమలు గానీ, దేవాలయములు గానీ, మసీదు, చర్చి ఏదైనా కట్టడములకు ఉత్తర దిక్కులో వీలైనంత ఖాళీ ప్రదేశం వదిలి పెట్టవలెనని వాస్తు శాస్త్ర సూత్రము. అలాగే ఉత్తరమున బరువు ఉప గృహములు , షెడ్లు, బాత్‌రూములు ఉత్తర దిక్కు మూత వేయుట మంచిది కాదు. అలాగే నూతులు, గోతులు, కిటికీలు ద్వారాలు ఏర్పాటు చేయుట మంచిది. ఉత్తరానికి దక్షిణము అభిముఖము కావున వీలైనంత బరువు, తక్కువ ఖాళీ దక్షిణములో బలము చేకూర్చాలంటే బరువు ఉండాలి.

దక్షిణానికి ఇరుప్రక్కల అంటే కుడిప్రక్కన పశ్చిమము అధిపతి శనీశ్వరుడు దక్షిణ, పశ్చిమ దిక్కులు మధ్య నైరుతి భాగము అధిపతి రాహువు ఈ అరమరికలను బట్టి దక్షిణ నైరుతి మరియు పశ్చిమ దిక్కులను కుజ, రాహు, శని జ్యోతిష శాస్త్ర రీత్యా వీరు పాపులు, క్రూరులు రాక్షస గణముగా వర్ణించవచ్చు. అందుచే ఎత్తైన కట్టడములు అధిక బరువులు నిర్మాణము చేపట్టడం మంచిది. శరీరములో సగ భాగము నాభి నుండి పాదాంతము వరకు వీరి ప్రభావం ఉంటుంది. వాస్తు శాస్త్ర రీత్యా అనేక దోషాలు ఉన్నాయి. ఒక చిన్నమాటలోను ఒక చిన్న వ్యాసం ద్వారానో వివరించి చెప్పడం అసంభవం! అయితే ముఖ ద్వారాలు, బావులు, కిటికీలు, గుంతలు నైఋతి వైపు ఉండరాదు. ఎన్నో పరిశ్రమలు, నిర్మాణాలు, దేవాలయాలు దక్షిణ, నైఋతి, పశ్చిమ దోషాల మూలకంగా శిధిలమైపోయాయి. గృహములు, పరిశ్రమలు అయితే యజమానులకు, ప్రార్థనా మందిరములయితే దొంగల, పరదేశీయుల ఆక్రమణలకు గురియగుట జరుగుతుంది. ఉదాహరణకు హంపీ విరూపాక్ష దేవాలయము, కాశీ, అయోధ్య, అలాగే తాజ్‌మహల్‌, రామకృష్ణ మిషన్‌, తిరుమల తిరుపతి, వ్యాట్‌కాన్‌ సిటీ, మక్కామసీదు వాస్తు శాస్త్ర నియమానుసారం కట్టబడినందుచే అత్యంత కీర్తి ప్రతిష్ఠలు, భోగబాగ్యములతో వర్థిల్లుతున్నాయి. పరిశ్రమలలో ప్రఖ్యాతి గాంచిన యూనియన్‌ కార్బైట్స్‌ మరెన్నో సంస్థలు వాస్తు శాస్త్ర నిర్మాణ లోపము వల్ల క్షీణించినాయి. అయితే కొందరు పండితులు కేవలం వాస్తు ప్రభావంతోనే అన్నీ జరుగుతాయా! అన్న సందేహాలను విమర్శలను సామాన్య ప్రజానీకం పరిష్కార మార్గాలపై వాస్తు విజ్ఞులను కలవడం జరుగుతున్నది.

అయితే జ్యోతిష్య శాస్త్రం ఆధారంతోనే వాస్తు శాస్త్రం ఒక భాగంగా పరిగణించబడుతుంది. దీనిని రావణబ్రహ్మ రావణ సంహిత అనే గ్రంధములో వాస్తు నియమాలతో పాటు జ్యోతిష్య శాస్త్ర పరిజ్ఞానాన్ని విశదీకరించారు. ప్రస్తుతము విదేశీయ వాస్తు అని ప్రచారం కాబడుతున్న ఫెంగ్‌షుయి చైనా ప్రాంతంనుండి మరియు పిరమిడాలజీ ఈజిప్టు ప్రాంతం నుండి వాటి ముఖ్య సూత్రాలను, గుర్తులను, చిహ్నాలను, అదృష్ఠ వస్తువులను నిశితంగా గమనిస్తే వేద సాంప్రదాయ వాస్తులో గుర్తించగలము.

ఉదాహరణకు లోషుగ్రిడ్‌ అంటే లక్ష్మీ యంత్రము ఇలా మరెన్నో !!! వివిధ రకాలైన పురాణ గాధలలో దేవాలయాల, గృహ, పరిశ్రమ, రాజసౌధాల నిర్మాణ ప్రక్రియ సంపూర్ణంగా వివరించబడిరది. మత్స్య, అగ్ని పురాణములలోను, మయ వాస్తు, విశ్వకర్మ వాస్తు గ్రంధములలోను, రామాయణ, మహాభారతములలోను విశదీకరించారు.

ఈ విధమైన ఉదాహరణలు మరెన్నో ఉన్నాయి. భారతదేశ పార్లమెంటు వృత్తాకార నిర్మాణం కలిగియున్నది. అదే అమెరికా పార్లమెంటు భవనం దీర్ఘచతురస్రాకారముగా ఉన్నది. కాబట్టే అమెరికా ప్రపంచములో కెల్లా బలమైన దేశంగానూ మనదేశం సరిjైున నాయకులు ఉన్నా విభిన్న భేదాభిప్రాయములు ఉండుటవల్ల దేశ ప్రగతి కుంటుపడి యున్నది. అయితే కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు తప్పని సరి అయినవి. ఉదాహరణకు ఇనుము, సిమెంటు ఆ కాలంలో వాడే వారు కాదు. కానీ ఇప్పుడు అవి లేకుండా నిర్మాణం చేయుట సాధ్యపడదు, కారణం కలియుగ లక్షణం. విదేశీయులు ఆక్రమణ పరిపాలన వారి సాంకేతిక

విద్యా పరిజ్ఞానము, భౌద్ధ మత ప్రచారంలో భాగంగా కొన్ని కళలు విదేశాలకు తరలింపబడినాయి. అందులో వైద్యం, అధర్వణ వేదం, ఆయుర్వేదం, గణితం మరెన్నో అతి ప్రాచీనమైన వేద సంస్కృతి తరలించబడినవి. ఫెంగ్‌షుయి, పిరమిడాలజీ ఆ విధంగా విదేశాలకు చేరి అక్కడి జియోలాజికల్‌ ఎన్విరాన్మెంటు మూలంగా మార్చబడి ప్రస్తుతం మన దేశంలో ప్రాచుర్యానికి వస్తున్నాయి.

మన దేశ వైదిక వాస్తు విదేశాలలో ప్రాచుర్యం పొందుతున్నాయి. ఉదాహరణకు మహేష్‌ యోగి, ఇస్కాన్‌, అమృతానందమయి వారి సంస్థల ద్వారా యజ్ఞ, యాగాదులు, క్రతువులు, ఆచార వ్యవహారములకు వాస్తు, జ్యోతిష్య విజ్ఞానాలకు ప్రాచుర్యం లభిస్తున్నది. వాస్తు శాస్త్ర నియమానుసారం కొన్ని ముఖ్యమైన సూత్రాలను పాటించడం తప్పనిసరి అని అనుభవం ద్వారా పరిశోధన ద్వారా తెలియనైనది. అది క్షేత్ర పరిజ్ఞానం, భూ పరిక్ష, దిక్సాధనము, పరిసరాల భౌతిక స్థితి ముఖ్యం. స్థలములకు దిగ్మూడము, ఉచ్ఛనీచలు, వీధులు(శూలలు) చతుర్విద వాస్తులను గమనించాలి. అవి భూమి, ప్రసాదము, యానము, శయనము ముఖ్యముగా స్థల నిర్ణయము ప్రముఖ పాత్ర పోషిస్తున్నవి.

వివిధ రకాలైన ఆకారాలలోకి వివిధ రకములైన యోగములు, భోగములు, రోగములు సంతరించుకుంటాయి. వీటిని మన పూర్వీకులు సామెతల ద్వారా ప్రచారం చేసారు.

‘‘ఇంటికి దీపం ఇల్లాలే ’’ ‘‘ఇంటిని చూసి ఇల్లాలిని చూడు ’’ ‘‘దిక్కున్న వాడికి చెప్పుకో ’’ ‘‘ఇంటిలోని పోరు ఇంతింత కాదయా ’’ ‘‘గృహమే కదా స్వర్గసీమ ’’ ‘‘మూలనున్న ముసలమ్మ’’ ‘‘పెద్ద దిక్కు లేని కొంప ’’ ‘‘ఇంటికన్నా గుడి పదిలం’’ ఇలాంటి సామెతలెన్నో మన పూర్వీకులు మనకు అందించారు. ముఖ్యంగా వాస్తును రెండు భాగాలుగా విభజించవచ్చు. స్థిర వాస్తు, చరవాస్తు స్థిర వాస్తు అనగా ముఖ్యమైన కట్టడములు. నిర్మాణము అనగా ఏ దిశలో ఏమేమి ఉండాలి. ద్వారములు, కిటికీలు, మెట్లు, బాత్‌ రూములు, పడక గదులు, పూజ గది, తోటలు, ప్రహరీ గోడలు, వంటగది ఇతరత్రా అంశాలు. చరవాస్తు అనగా ఇంటికి వాడే రంగులు, పెంచవలసిన తగని తగిన మొక్కలు, వృక్షాలు, గృహోపకరణాల అమరిక, యజమాని దశ రీత్యా చేయవలసిన, ఆచరించవలసిన అంశాలను చరవాస్తులో పరిశోధకులు మాత్రమే చెప్పగలిగిన అంశాలు.