Y.S.R Congress Party
లగ్నం : కర్కాటకం రాశి : వృషభరాశి నక్షత్రం : రోహిణి 4వ పాదం తృతీయంలో శని వక్రి, రాహువు పంచమం ధనస్సు, శుక్రుడు సప్తమ స్థానం మకరం, రవి,కుజులు కుంభం, గురుడు, బుధులు నవమం మీనరాశి, చంద్ర కేతువులు ఏకాదశ స్థానంలో స్థితులై యున్నారు. ప్రస్తుతం రాహు మహర్దశ. చంద్ర, కుజ దశలలో పార్టీ నేత జైలులో ఉండటం తరువాత ప్రతిపక్షంలో ఉండటం జరిగింది. 2019 చంద్ర భుక్తిలో చంద్రుడు లగ్నాధిపతి అయి స్వనక్షత్రంలో ఉండటం వలన కేతువు ఉప నక్షత్రాధిపతి అవడం వల్ల అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి పదవి చేరువ అవడం జరిగినది. ప్రస్తుతం గురు దశ శని భుక్తి గురువు ఉపనక్షత్రాధిపతి అవడం వల్ల కేవలం ప్రతిపక్ష నాయకుడిగా రావడం జరుగుతుంది. అష్టమం కుంభములో రవి కుజులు స్థితులై ఉండటం వల్ల రాష్ట్రాన్ని ఆర్థిక ఇబ్బందులకు గురిచేయడం జరిగింది. శని ఇంట్లో రవి, కుజులు కలసి యుండటంచే ప్రజావ్యతిరేక, కక్షపూరిత, అన్యాయ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. శని ప్రస్తుతం మకర రాశిలో ఉండటం వల్ల దశమాధిపతి అయిన కుజునితో కలవడం వల్ల ప్రజా ఆదరణ కోల్పోవడం జరుగుతుంది. ఈ సంవత్సర ఎన్నికలలో అక్రమ మార్గాలతో ప్రయత్నించినప్పటికీ ఫలితం దక్కదు.