Y S jagan
లగ్నం : కన్య రాశి : మిధునం నక్షత్రం : ఆరుద్ర 2వ పాదం లగ్నాత్ లగ్నంలో యురేనస్, ద్వితీయంలో కుజుడు, వృశ్చికంలో బుధ, శుక్రులు, ధనస్సులో రవి, గురు, రాహువులు ` వృషభంలో శని వక్రి చంద్రుడు మిధున రాశిలో కేతువుతో కలసి ఉండడం జరిగినది. జాతకంలో రాజ యోగములు : గురుడు స్వస్థానంలో రవితో కలసియుండటం, ఈ రెండు గ్రహములు రాజ్యస్థానం వీక్షణచే తండ్రి ద్వారా రాజకీయ లబ్ది, పదవీ లాభం కలసివచ్చాయి. జాతకములో 2019 ఫిబ్రవరి నుండి 2036 వరకు బుధ భుక్తి. 13-07-2020 నుండి 13-05-2025 వరకు బుధ భుక్తిలో శుక్ర అంతరం జరుగును. 07-05-2024 నుండి 18-10-2024 వరకు శని మహర్దశ విదశ వల్ల ప్రతిపక్ష నాయకుని హోదా లభించుట సూచిస్తున్నది. శని కుంభంలో గోచరించుటచే దశమాధిపతి అయిన బుధుని వీక్షణచే పదవులలో మార్పు తథ్యము. 2027-28 మధ్యన ప్రయాణ గండాలు 2029-30 ప్రయాణాలలో తగు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం సూచిస్తున్నది.