Revanth Reddy
లగ్నం : వృషభం రాశి : తుల నక్షత్రం : చిత్త 4 వ పాదం చతుర్థంలో కేతువు, యురేనస్ పంచమంలో గురుడు అష్ఠమ లాబాధిపతి చంద్ర, శుక్ర, బుధ, రవి, బుధులు ` ఉన్నారు. ఇది గొప్ప విపరీత రాజయోగం. కుజుడు మకరంలో ఉండి ఉచ్ఛస్థితి. రాహువు దశమంలో కుంభరాశి ` ఏకాదశ భావంలో శని వక్రి. లాభంలో ఉండుటచే విపరీత రాజయోగం అనూహ్య పరిణామాలలో రాజయోగం, శని గోచారం కుంభంలో ఉండటం వల్ల అనూహ్య రీతిలో ముఖ్యమంత్రి అవ్వటం జరిగింది. 05`11`2025 నుంచి 02`11`2026 లోపల అంతర్గత (జరగబోయే ఎంపి ఎన్నికలలో తగినన్ని సీట్లు రాకపోవడం వల్ల , కేంద్ర పరిపాలన వల్ల కొన్ని పరిస్థితులలో ఎన్‌డిఏ కి తలొగ్గి రాజ్యపాలన సాగడం జరుగుతుంది).
గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్ష పదవీ స్వీకార ముహుర్త విశ్లేషణ ఈ ముహూర్తమునకు పీసీసీ అధ్యక్షునిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ ముహూర్త విశ్లేషణను పరిశీలించగా లగ్నం తులా లగ్నం చతుర్థంలో శని వక్రి, పంచమంలో గురుడు వక్రి, సప్తమంలో యురేనస్, అష్టమంలో చంద్ర రాహువులు, నవమంలో రవి బుధులు, దశమంలో శుక్ర కుజులు జరుగుతున్న దశ చంద్ర మహాదశ ముఖ్యంగా ఏ ముహూర్తానికి అయినా కావలసింది అష్టమ శుద్ధి. లగ్నాత్ అష్టమంలో రాహువు, చంద్రులు స్థితులై ఉండటం వల్ల ఇది చాలా ఘోరమైన ముహూర్తం. ఎందువల్ల ననగా చంద్రుడు మన:కారకుడు దశమ ఆధిపత్యం కలిగి అష్ఠమంలో స్థితుడుఅవటం పైగా రాహువుతో కలయిక. ఈ సమయంలో ప్రమాణస్వీకారంచే ఎక్కువ కాలం పదవిలో నిలవటం జరగదు. పెద్దపదవిలో ఉన్నవారు మరణించడం వల్ల మార్పులు మరలా జరుగుతాయి. చతుర్థ స్థానం ప్రజలను సూచిస్తుంది. శని వక్రగతి అయి చతుర్థమునకు కుజ దృష్ఠివల్ల మరియు కుజుడు ద్వితీయ సప్తమాధిపతి అవటంచే పార్టీలో ఉన్న సహకార్యకర్తలు, సభ్యులు కుజ, శనుల వీక్షణచే ఈ ముహూర్తంలో బలం లేకపోవడంచే అంతర్గత కలహాలు, విభేదాలు చాపక్రింద నీరులా తప్పని పరిస్థితి. శుక్రుడు లగ్నాధిపతి అష్ఠమాధిపతి అయి దశమంలో ఉన్నాడు. అయితే శని వీక్షణవల్ల పదవీ వ్యామోహాల వల్ల, పదవీ మోజు తప్ప ఎక్కువ కాలం నిలిచే యోగం లేదు. తరువాత సప్తమ ద్వితీయాధిపతి కూడా కుజుడు కావటం కూడా ఒక కారణం. ముహూర్తం ఎలా నిర్ణయించారో తెలియదు. ఒకవేళ నిర్ణయించిన వారికి శాస్త్రపరిజ్ఞానం ముహూర్త భాగంలో లేకపోవచ్చు. జ్యోతిష్యశాస్త్రంలో అనేక కోణాలలో పరిశీలన ముఖ్యం.. పరాశర సిద్ధాంతములో కూడా ఎక్కడా బలం లేదు ఉదాహరణకి పిసీసీ అయ్యాక సిఎం రేసులో అదే కేంద్రములో అయితే పిఎం రేసులో ఉండటం జరుగుతుంది. ముహూర్తంలో లగ్నాధిపతి దశమంలో ఉన్నా కానీ దశమంలో ఉన్న చంద్రుడు అష్ఠమంలో ఉన్నాడు. కావున వచ్చే ఎన్నికలలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అన్న ఆశలు లేవు రాదు అని సుస్పష్ఠంగా గోచరిస్తున్నది. పదవి మార్చడం వల్ల వాస్తును మార్చడం వల్ల ఫలితాలు వస్తాయి అన్న భావనతోనే కొన్ని వాస్తు మార్పిడిని చేయడం జరిగింది. స్థలవర్ణన భౌగోళిక పరమైన కొన్ని అడ్డంకులు కూడా ఒత్తిడిలను కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఈ ముహూర్తం వల్ల ఎటువంటి లబ్డి చేకూరదు. పైగా అంతర్గత కలహాలు ఎక్కువ అవుతాయి. పైకి కనిపించకుండా ఉన్నా కీడు చేసే గ్రహస్థితి ఈ ముహూర్తం. అష్ఠమ శుద్ధిలేదు చంద్రునికి శుద్ధిలేదు. అంటే పెద్దలకు బుధ్ధిమాంద్యము కలిగి ఉండవచ్చు. చంద్రుడు మన:కారకుడు ముహూర్త నిర్ణయం ఎలా జరిగిందో తెలియదు మనకి. లగ్న నక్షత్రానికి రాహువు ఆధిపత్యం వల్ల మరియు సోనియాగాంధి గారి జన్మనక్షత్రాధిపతి కూడా రాహువే కావడం అదికూడా అష్టమంలోనే ఉంది. ఇదంతా చూస్తే ఉపయోగంలేని పనులు, ఉపయోగం లేని ముహూర్తం సంభవించిది. రేవంత్‌రెడ్డి గారు మంచి ప్రజాదరణ కలిగిన నాయకుడు అయినప్పటికీ పార్టీ బలహీనత వల్ల నిస్సహాయులవుతారు. రేవంత్‌రెడ్డి గారు కూడా భవిష్యత్తులో పార్టీని వీడే అవకాశం తథ్యం.