Congress I Formation Day
ప్రస్తుతం కాంగ్రెస్ ఐ 02-01-1978 ఉదయం ఢల్లీిలో ఇందిరా కాంగ్రెస్ స్థాపించబడిరది. దీన్ని బట్టి ప్రస్తుతం గురుమహర్దశలో రవి భుక్తి జరుగుచున్నది. జరుగుతున్న దశలో ఎక్కడా బలం లేదు. తృతీయ వ్యయాధిపతి అయిన గురుడు పంచమంలో ఉండటం వక్రించి ఉండటం వల్ల ఉపనక్షత్రాధిపతి చంద్రుడు అవటం వల్ల చంద్రునికి అష్ఠమ స్థానాధిపత్యం రావడం వల్ల కాంగ్రెస్ ఐ ఎక్కువ కాలం నిలవదు, నిలవలేదు అని ఇదివరకే చెప్పడం జరిగినది. 1998 నుండి కాంగ్రెస్ సోనియా అని అనుకోవచ్చు. 1998లో నేషనల్ కాంగ్రెస్ ప్రసిడెంట్ సోనియా గాంథీ గారు. ఈ యొక్క గ్రహస్థితి ప్రకారం కూడా తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశాలు చాలా చాలా తక్కువగా ఉన్నాయి.. కేవలం 2026-27 తరువాత మరిన్ని మార్పులు జరిగి మరలా పార్టీ పుంజుకోవడం జరుగుతుంది. 31-08-2022 వరకు రవి భుక్తి 31-12-2022 వరకు చంద్రభుక్తి 07-12-23 వరకు కుజ భుక్తి జరుగుతాయి. పదవిలోకి రావడం మళ్లీ పుజర్జీవం రావటం జరిగే పని కాదు. కేవలం శని దశలో 2026-27లో మరిన్ని మార్పులు జరిగి కొంచెం ఊపిరి పీల్చుకునే అవకాశం గోచరిస్తున్నది. ఇది గోచార రీత్యా కాంగ్రెస్ ఐ లేదా సోనియా కాంగ్రెస్.
లగ్నం ` మకరం, రాశి ` కన్య, నక్షత్రం ` హస్త 2వ పాదం లగ్నాత్ ద్వితీయంలో కేతువు, పంచమంలో గురుడు వక్రి, సప్తమంలో కుజ, శనులు వక్రి, అష్టమంలో చంద్ర, రాహువులు, నవమంలో యురేనస్, వ్యయంలో బుధ, రవి, శుక్రులు స్థితులై యున్నారు. గడచిన దశలు చంద్ర, కుజ, రాహువు మహర్దశలలో 2014 వరకు గురు దశలో శని భుక్తి వరకు కొన్ని ఇబ్బందుల చేత పరిపాలన సాగించింది.
2014 నుండి ప్రస్తుతం గురు దశలో రాహు భుక్తి 30`04`2026 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఎటువంటి రాజయోగములు లేవు. తరువాత శని మహర్దశలో పార్టీ కనుమరుగయ్యే సూచన. శని సప్తమంలో ఉండటం కేతు నక్షత్రం రాహువు ఉపనక్షత్రాధిపతి అవటం వల్ల 2029 అనేక మార్పులు జరుగుతాయి. సప్తమంలో కుజుడు వక్రించి ఉండటం వల్ల కుజుడు శని నక్షత్రంలో ఉండటం వల్ల 2027`28 లలో పార్టీ విచ్ఛిన్నం. రాబోయే ఎన్నికలలో 2029`30 మధ్య అన్ని రాజకీయ పార్టీలలో గందరగోళం ఉంటుంది.