Bharatiya Janata Party
బి.జె.పి వ్యవస్థాపక దినం 06-04-1980 నాగపూర్ లగ్నం : సింహం , రాశి : వృశ్చికం, నక్షత్రం : జ్యేష్ఠ 4వ పాదం లగ్నంలో శని, చతుర్థంలో చంద్రుడు, ఆరవ ఇంట కేతువు, ఏడవ ఇంట బుధ, రవులు, శుక్రుడు భాగ్యమందు, కుజ, రాహు, గురులు వ్యయ స్థానంలో ఉన్నారు. గతంలో బుధ, కేతు, శుక్ర, రవి దశలు అనగా 36 సంవత్సరముల వరకు పార్టీకి ప్రాముఖ్యత లేదు. అయితే చంద్ర దశ 2014 నుండి రావడంచే 2024 డిసెంబరు వరకు తదుపరి 2026-27 వరకు పార్టీ అద్భుత విజయాలు సాధిస్తుంది. 2026-27 సంవత్సరాలలో కొన్ని అంతర్గత విభేదాలు పొడచూపుతాయి. 2028 జూలై వరకు అనేక సంస్కరణలతో దేశాన్ని ప్రగతి పథంలో నడిపిస్తుంది. పార్టీలో ఎన్ని అంతర్గత విభేదాలు ఉన్నప్పటికీ 2031 నుండి పార్టీలో విభేదాలు వస్తాయి. పార్టీ యొక్క రూపు రేఖలు మారబోనున్నాయి. దశమాధిపతి బుధుడై వర్గోత్తమం వలన, దశమ నక్షత్రాధిపతి చంద్రుడై ఉప నక్షత్రాధిపతి శని అవడం వల్ల ప్రస్తుత దేశాధిపతి నరేంద్రమోడి దేశాన్ని అభివృద్ధి వైపు నడిపిస్తారు. అయితే 2029 నాటి ఉగాదికి భారతదేశ భవితవ్యం గొప్పగా ఉంటుంది. దేశ రాజకీయ పరిస్థితులలో పెను మార్పులు సంభవిస్తాయి. చాలా మంది రాజకీయ నాయకులు కనుమరుగవుతారు. రాగల 5 సంవత్సర కాలంలో మోడీ ప్రధానిగా కొనసాగినంత కాలం దేశ రాజకీయ, న్యాయ వ్యవస్థ , ఆధ్యాత్మిక రంగాలలో అభివృద్థి, రాజ్యాంగ వ్యవస్థలో అనేక మార్పుచేర్పులు ఆకస్మికంగా జరుగనున్నాయి. విశ్వావసు నామ సంవత్సరాదిలోపుగా ఈ క్రోధి నామ సంవత్సర పూర్వార్థములో మరియు ఉత్తరార్థములలో విద్వేషాలు ఎక్కువ అయి వచ్చే విశ్వావసు నామ సంవత్సర ఉగాది నాటికి అన్నీ పరిష్కారమవుతాయి. 24-04-2026 నుండి 31-08-2026 లోపల ప్రధాని పదవిలో ఆకస్మికంగా మార్పులు సంభవించవచ్చు. ఏది ఏమయినా భారత దేశ జన్మజాతక ప్రకారం 2027 నుండి 2030 ప్రపంచదేశాలలో మన దేశం అగ్రస్థానంలో ఉండబోతోంది. భవిష్యపురాణం ప్రకారం ఒక యోగి భారతదేశాన్ని పరిపాలిస్తాడని తద్వారా అఖండ కీర్తి సాధిస్తాడని పురాణేతిహాసాలలో చెప్పబడి యున్నది.